Andhra PradeshVisakhapatnam
మాజీమంత్రి గంటాతో నారా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు భేటి..!

మాజీమంత్రి గంటాతో నారా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు భేటి..!
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి, ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుని భీమిలి నియోజకవర్గo నారా లోకేష్ ఫౌండేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలసి, ఫౌండేషన్ ద్వారా భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు అందించాలని అనుకుంటున్నామో వివరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయాలనే తలంపు చాలా గొప్ప విషయమని, తప్పకుండా మీ ఫౌండేషన్ కి నావంతు సహకారం అందిస్తానని గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులు సంతోష్ రాజా, దౌలపల్లి హరీష్, అరసవిల్లి అనిల్ మణిరెడ్డి, చిల్ల సూరి రెడ్డి రెడ్డి, కోరాడ రాంబాబు, అవనాపు రవి చరణ్ తదితరులు తెలిపారు.