మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై దాడి చేయటం అప్రజస్వామ్యం : ముత్తుముల అశోక్ రెడ్డి
క్యాపిటల్ వాయిస్, గిద్దలూరు :- శుక్రవారం ఉండవల్లి లోని మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఎమ్మెల్యే జోగి రమేష్ వారి అనుచరులు దాడిచేసి, హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిచడాన్ని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై దాడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేయటం అప్రజస్వామ్యం అని ఆయన తెలిపారు. నిన్నటి దినమున కోడెల శివ ప్రసాద్ గారి సంస్మరణ సభలో అయన్నపాత్రుడు ఈ రాష్ట్ర పరిపాలన మీద విమర్శలు చేస్తే దానికి ప్రతిగా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి మీదకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు కర్రలతో దాడిచేయడం హేయమైనచర్య అని ఆరోపించారు. నిన్నటి నుండి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ధర్నా చేస్తా అని జోగి రమేష్ సోషల్ మీడియాలో పెడుతున్నప్పటికీ పోలిసులు ఎందుకు ఆపలేదో అర్ధం కావడం లేదన్నారు. జోగి రమేష్ , చంద్రబాబు నాయుడు ఇంటివద్దకు చేరుకొని టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, పట్టాభి, మరియు కొంత మంది టీడీపీ కార్యకర్తలపై రాళ్ల తో, కర్రలతో దాడిచేస్తుంటే అక్కడికి వచ్చినా వైసీపీ నాయకుల మీద చర్యలు తీసుకోవలసిన పోలిస్ లు టీడీపీ నాయకులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ వైసీపీ నేతలు గుండాలు లాగా ప్రవర్తిస్తుంటే పోలిసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించినట్లు, దీనికి నాయకత్వం వహించిన జోగి రమేష్ ప్రజా ప్రతినిదా లేక వీధి రౌడినో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి ఇంటి పై డాడి చేసి ఆయన పై హత్యా యత్నం చేయాలనుకోవడంపై, జోగి రమేష్ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం చేపట్టితే పోలిస్లు ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేయడం వారికి నోటిసులు ఇవ్వడం గృహ నిర్బంధం చేయడం చేస్తూ ఉంటారు జోగి రమేష్ ను ఎందుకు ఆపలేదో పోలిస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంద్రప్రదేశ్ లో శాంతి భద్రతలు కరువయ్యాయని, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక పోతే నియంతృత్వ పాలన కొనసాగుతుందా అనేది అర్ధం కావడం లేదన్నారు. ఈ దాడి ప్రజా స్వామ్యం మీద, భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిఅని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రము పై విచారణ జరిపించి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదే విధముగా ఎవరితే ఈ దాడిలో పాల్గొన్నారో, అలాగే పరోక్షంగా సహకరించారో వారందరి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.