Andhra PradeshNTR JILLA
మైలవరం ఎమ్మెల్యే వసంత బలం”బలగం”…!!

మైలవరం ఎమ్మెల్యే వసంత బలం”బలగం”…!!
ఎమ్మెల్యే సీటు పై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధత…!!
మైలవరం లో మొదలైన వసంత మార్క్ రాజకీయం…!!
ఎమ్మెల్యే వసంత గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు…!!
ఎమ్మెల్యే వసంత తో కలిసి నడుస్తున్న కొండపల్లి మున్సిపాలిటీ, ఇబ్రహింపట్నం నేతలు…!!
నేతల మద్దతు ,ప్రజల ఆత్మీయ స్వాగతాల నడుమ కొనసాగుతున్న గడపగడపకు వైసీపీ…!!
క్యాపిటల్ వాయిస్, మైలవరం:- నియోజకవర్గ వైసీపీ సీటు ఎవరిని వరిస్తుందో అనే ప్రచారానికి ఇంకా తెర పడినట్లు కనిపించడం లేదు. మైలవరం ఎమ్మెల్యే స్థానం లో ఎవరు పోటీ చేయాలి అనే అంశాన్ని పార్టీ అధిష్టానం ఇంకా పెండింగ్ లో ఉంచింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ మైలవరం వైసీపీ లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు రాజకీయ చర్చకు దారితీస్తుంది. టికెట్ల గోల కొద్దిగా పక్కన పెడితే మైలవరం లో ఎమ్మెల్యే వసంత మార్కు రాజకీయం మాత్రం మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయపదం లో నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వసంత రాజకీయ అస్త్రాలను సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బలం బలగం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మైలవరం లో ఉన్నది ఒకటే వర్గం అది వసంత వర్గం అనే సంకేతాలు పంపించే విధంగా పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే వసంత గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా ప్రజల నుండి విశేష స్పందన లభించడం తో ప్రజల్లో ఎమ్మెల్యే వసంత పై వ్యతిరేకత లేదు అనే స్పష్టమైన సంకేతం ఇచినట్లైంది. మైలవరం పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్యే వసంత గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతుండటం తో ప్రజలను గెలిచాం అనే ధీమా తో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఇక మిగిలిన పార్టీ నేతల అంశం లో కూడా ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనే చెప్పాలి. మైలవరం లో జరుగుతున్న వైసీపీ గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి మైలవరం లోని అన్ని మండలాల నుండి నేతలు వసంత తో కలిసి నడుస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ తో పాటు ఇబ్రహీంపట్నం మండలం, జీ కొండూరు, రెడ్డి గూడెం ఇలా అన్ని మండలాల నుండి నేతలు గడప గడపకు క్యూ కడుతున్నారు.. అయితే జరుగుతున్న పరిణామాలను బాహ్య ప్రపంచానికి చూపించి మైలవరం లో ఎమ్మెల్యే వసంత “బలం, బలగం” ఏమిటో కొత్తగా పరిచయం చేస్తున్నట్లు ఉన్నాయి. మైలవరం వైసీపీ లో ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లు ఉండటం తో భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ మాత్రం వీడటం లేదు..