మధురవాడ లో వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతి కి ఘన నివాళి

మధురవాడ లో వంగవీటి మోహన్ రంగా 33వ వర్ధంతి కి ఘన నివాళి
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు నాయకుడు అనగానే అందరి మదిలో మెదిలే ప్రప్రధముడు దివంగత నేత వంగవీటి మోహన్ రంగారావు వర్ధంతి పురస్కరించుకొని మధురవాడ కాపు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాధా రంగా మిత్రమండలి సభ్యులు అద్దంకి సాంబశివరావు పర్యవేక్షణలో వైజాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా సంస్మరణ కార్యక్రమంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా 33వ వర్ధంతి పురస్కరించుకుని, వృద్ధులకు పండ్లు పంపిణీతో పాటు వారికి భోజన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా సోదరుని కుమారుడు వంగవీటి మేఘనాథ్, రాధా రంగా మిత్రమండలి సభ్యులు జనసేన నాయకులు బి.వి.కృష్ణయ్య, సామాజిక సేవకులు పొప్పపు కాశీ రావు వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరుపేదలకు సహాయం అందిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి మోహన రంగ అన్నారు. నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని అభివర్ణించారు. సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన నిరుపేదల కోసం నిరంతరం తపించే వారని అన్నారు. ఈకార్యక్రమంలో శ్రీకాంత్ జి.కె.కన్స్ట్రక్షన్, కాపు సంఘం నాయకులు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఇ.ఎన్.ఎస్ చంద్ర రావు, వి.నర్సింగ్రావు కోనప్పరెడ్డి సాయి, బావి శెట్టి సత్యనారాయణ, నాని, బలరాం, పసుపులేటి గోపీనాథ్, పసుపులేటి చలం, అబ్బిరెడ్డి చంద్రశేఖర్, గొంతిని హరికృష్ణ, వరుపుల రమేష్, వాంబే కాలనీ పాత మధురవాడ మెట్ట, వైయస్సార్ కాలనీ, సాయిరామ్ కాలనీ మారికవలస ప్రాంతాల్లోని కాపు సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు.