Andhra PradeshGuntur
మాచర్ల తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (బ్రహ్మారెడ్డి) నియామకం

మాచర్ల తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (బ్రహ్మారెడ్డి) నియామకం
అధికారికంగా ప్రకటించి రాష్ట్ర టి డి పి అధ్యక్షుడు కె అచ్చెం నాయుడు
మాచర్లలో నియోజకవర్గంలో మళ్ళీ టి డి పి జెండా ఎగరాలని కోరిన అధిష్టానం
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- మాచర్ల తెలుగుదేశం నియోజకవర్గ ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (బ్రహ్మారెడ్డి) నియమించినట్లుగా టి డి పి అధిష్టానం బుధవారం ప్రకటించింది. మాచర్ల నుంచి గతంలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన చిరుమామిళ్ళ మధుబాబు ను రాష్ట్ర కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఇప్పటిదాకా డోలాయమానంలో ఉన్న తెలుగుదేశం మాచర్ల నియోజకవర్గ పరిస్థితి ఇపుడు ఒక స్పష్టమైన రూపుకు వచ్చిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటిదాకా నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగిన కొమ్మారెడ్డి చలమారెడ్డి కి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద భాద్యతను ఇస్తామని బుజ్జగించినట్లుగా తెలుగుదేశం నాయకుల సమాచారం. బుధవారం ఈ విషయమై మాచర్ల నుంచి టికెట్ ఆశించే నాయకులతో అంతరంగికంగా సమావేశం అయిన టి డి పి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితుల గురించి తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలంటూ సూచనలు సలహాలు ఇస్తూ మాచర్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండి అందరం తెలుగుదేశం పార్టీ అంటూ నినాదంతో ముందుకు వెళ్తూ మాచర్ల గడ్డ తెలుగుదేశం జెండా ఎగుర వేయాలి అంటూ ఈ సందర్భంగా తెలిపారు. పరిస్థితులను ఆకళింపు చేసుకుని, అక్కడి నియోజకవర్గ పరిస్థితులపై ఒక అంచనా కు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారని నాయకులు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక అన్ని పరిస్థితులను అర్ధం చేసుకుని, కార్యకర్తల మనోగతాన్ని దృష్టిలోకి ఉంచుకుని ఎవరిని నొప్పించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అయన అన్నట్లుగా నాయకులు తెలిపారు. ఇప్పటికైనా మాచర్ల నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలు వీడి, ప్రజా సమస్యలపై పోరాడాలని అలాగే ఇంచార్జ్ గా నియమితులైన జూలకంటి బ్రహ్మారెడ్డికి అందరు సహకరించాలని అయన కోరినట్లు తెలిసింది. చంద్రబాబు కూడా ఇదే ఆశిస్తున్నారని అయన తెలిపారన్నారు. ఈ సమావేశంలో మాచర్ల టిడిపి ఇన్చార్జ్ చలమారెడ్డి,చిరుమామిళ్ల మధుబాబు,కుర్రి పున్నారెడ్డి పాల్గొన్నారు.