Telangana

లంచం లేనిదే ఏ ఫైల్ కదలదు – బస్ పాస్ రెన్యువల్ చేయాలి అన్నా కాసులు సమర్పించాల్సిందే !?

లంచం లేనిదే ఏ ఫైల్ కదలదు – బస్ పాస్ రెన్యువల్ చేయాలి అన్నా కాసులు సమర్పించాల్సిందే !?

+ టీసీ, బోనోఫైడ్ ,మెమో కావాలి అంటే నోటు ఇస్తేనే పని 
+ మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐ కాలేజీ లో భాగోతం
క్యాపిటల్ వాయిస్ (తెలంగాణ) మంచిర్యాల జిల్లా :- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని కనీసం బస్సు పాస్ రెన్యువల్ చేసుకోవాలంటే కూడా సొమ్ము చెల్లించాలని విద్యార్థులు వాపోతున్నారు.ఐటిఐ కళాశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న రమేష్ ఈ తతంగం నడిపిస్తున్నారాని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఐటిఐ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఏదైనా సహయార్థం ఆఫీసుకు వెళితే కాసులు ఇవ్వనిదే కనికరించరు. ప్రభుత్వ కళాశాలకు వచ్చే వారిలో సగంకి పైగా నిరుపేద విద్యార్థులే ఉంటారు. ఏదో ఒకలా చదువుకుని ప్రభుత్వ కళాశాలలో సీటు సాధిస్తే  అంతా ఫ్రీగా చదువుకోవచ్చు అనే దృక్పథం తో ఎంతో మంది ఉంటారు,కాని అక్కడ పని చేసే  కొంత మంది సిబ్బంది మాత్రం సంస్థకె మాయని మచ్చలా పేరు తీయకు వస్తున్నారు. పేద విద్యార్థుల దగ్గర నుండి సందు దొరికినప్పుడల్లా ఏదో ఒక సాకుతో విద్యార్థుల దగ్గర నుండి డబ్బులు వసూల్ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్స్ స్కాలరుషిప్స్ రెన్యువల్ చేయాలన్నా,బస్ పాస్ కావాలన్నా, బోనోఫైడ్ ఇవ్వాలన్నా విద్యార్థుల నుండి 200నుండి500 రూపాయలు తీసుకుంటున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వం పరీక్ష ఫీజు ఒకంత చెప్తే యాజమాన్యం మాత్రం ఎక్కువ గా వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి .ఆఖరికి విద్యార్థుల కాలేజీ నుండి చదువు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అందించే మెమో,టీసీ,లను సైతం వ్యాపారం చేస్తున్నారు.500 రూపాయలు ఇస్తేనే స్టడీ సర్టిఫికెట్స్ ఇస్తాను లేకపోతే ఇవ్వను అంటు వేదిస్తున్నారట. అదేవిధంగా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించేవాడని విద్యార్థులు చెప్తున్నారు . ఆఖరికి ప్రిన్సిపల్ మాటలని సైతం లెక్కచేయడనే ఆరోపణలు ఉన్నాయి. విద్యతో,విధ్యార్థులతో వ్యాపారం చేస్తున్న రమేష్ దాదాపుగా సంవత్సరం లో  50వేల నుండి లక్ష రూపాయలకు  పైగా డబ్బులు విద్యార్థుల నుండి సొమ్ము చేసుకుంటున్నారట ,ఒక స్టాంప్ వేయాలంటే కూడా ఎంతో కొంత సమర్పించాలి అట లేకుంటే పని జరగదు,ప్రభుత్వం ఒక వైపు వేలకు వేలు జీతాలు ఇస్తుంది మరో వైపు బాగా ఉన్నతంగా చదువుకుని పీజీ, పీహెచ్ డీ లు చేసి ప్రయివేటు  సంస్థ లల్లో పని చేస్తూ కాలం ఎల్ల దీస్తుంటే ప్రభుత్వ సంస్థలలో పని చేసే ఉద్యోగుల పని తీరు ఇలా ఉంది, ఇంత జరిగిన యాజమాన్యం చూసి చూడనట్లు ఉంటున్నారని ఆయన వల్ల కళాశాలకు రావాలంటే కూడా ఇబ్బంది కలుగుతుందని విద్యార్థులు తెలిపారు. ఇంత మోసానికి పాలుపడుతున్న రమేష్ ని సస్పెండ్ చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!