Health

కొవ్వును కరిగించి, బరువు తగ్గేలా చేసే బిర్యానీ ఆకులు – తేనీరు రూపంలో తీసుకుంటే మేలు !

 

కొవ్వును కరిగించి, బరువు తగ్గేలా చేసే బిర్యానీ ఆకులు – తేనీరు రూపంలో తీసుకుంటే మేలు !

క్యాపిటల్ వాయిస్, ఆరోగ్య సమాచారం :- ఈ టీని రోజూ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలతో పాటు చెడు కొవ్వు కూడా తొలగిపోయి సులభంగా బరువు తగ్గుతారు. క్రమం తప్పకుండా బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌, అధిక కేలరీలని త్వరగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.సుగంధ ద్రవ్యాల్లో బిర్యానీ ఆకు ఒకటి. బిర్యానీలో మసాల దినుసుగా వాడతారు కాబట్టే దానికి బిర్యానీ ఆకుగా పిలుస్తారు. వివిధ రకాల
ఆహార పదార్థాల తయారీలో ఈ ఆకును ఉపయోగిస్తారు. రుచిని, వాసనేకాదు ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాపర్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,సెలీనియం, ఐరన్ లాంటి మినరల్స్‌ బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉంటాయి. బిర్యానీ ఆకులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు కంట్రోల్‌ చేయడంలో దోహదపడుతుంది. క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి బిర్యానీ ఆకులకు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ బిర్యానీ ఆకులతో కషాయాన్ని చేసుకుని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ కషాయం బాగా ఉపకరిస్తుంది.అలాగే బిర్యానీ ఆకులతో
తయారు చేసుకున్న టీ తాగటం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బిర్యానీ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ టీ ని తాగడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బుల బారిన పడకుండా ఉంటారు. బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. బిర్యానీ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. నెలసరి సమస్యలతో బాధపడే స్త్రీలు ఈ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ టీ ని తాగడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గు ముఖం పడుతుంది.

బిర్యానీ ఆకు టీ తయారీ ;
బిర్యానీ ఆకుల టీ తయారీకి10 గ్రాముల బిర్యానీ ఆకు, 10 గ్రాముల వాము, 5 గ్రాముల సోంపు అవసరం. వీటన్నింటిని కలిపి గ్రైండ్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. 1 లీటరు నీటిని గ్యాస్‌పై వేసి మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి మరిగించాలి. నీరు బాగా తగ్గిన తర్వాత 100ఎంఎల్ కు వచ్చేంతవరకు మరగనివ్వాలి. తరువాత ఆ టీని వడగట్టి గోరువెచ్చగా ఉండగా సేవించాలి. అవసరమనుకుంటే తేనెను కలుపుకోవచ్చు. 

ఈ టీని రోజూ తాగితే త్వరగా బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలతోపాటు చెడు కొవ్వు కూడా తొలగిపోయి సులభంగా బరువు తగ్గుతారు. క్రమం తప్పకుండా బిర్యానీ ఆకుల టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌, అధిక కేలరీలని త్వరగా కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ టీ ని తాగడం వల్ల ఆయా సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బిర్యానీ ఆకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ శరీరంలోని క్యాన్సర్ కారకాలతో సమర్థవంతంగా పోరాడతాయి. ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది. గ‌ర్భిణీల‌కు దీని అవ‌స‌రం అధికం. బిర్యానీ ఆకుల్లో ఉన్న యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకర బ్యాక్టీరియా వైరస్ వల్ల వచ్చే ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులు, గొంతు నొప్పి సమస్యలను దూరం చేస్తాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందడం మంచిది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!