కొండకెంగువ లో ఘనంగా దేవుడుబాబు యాత్ర

కొండకెంగువ లో ఘనంగా దేవుడుబాబు యాత్ర
క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం
స్థానిక మండల పరిధిలోని కొండకెంగువ గ్రామంలో 12-02-2022 శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా దేవుడుబాబు యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ కంచుపల్లి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు, ఉదయం నిత్య యవ్వనానందస్వామి దేవుడుబాబు చిత్రపటాన్ని గ్రామంలో ఊరోగింపుతో ప్రారంభమయ్యే ఈ యాత్రలో తప్పిటగుండ్లు, బిందెల డాన్స్, చోడవరం డప్పులు వంటి కార్యక్రమాలతో పాటు, సాయంత్రం రేలా రేలారే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. స్వామి సంవత్సరమంతా మౌనంగా ఉండి భీష్మఏకాదశి నాడు భక్తులతో మాట్లాడేవారు. ఆ సందర్భంగా ప్రతీ సంవత్సరం గ్రామస్థుల సహకారంతో గ్రామ పెద్దలు యాత్ర నిర్వహిస్తున్నారు. స్వామి దైవ సాంగత్యం పొందిన తర్వాత ఆశ్రమాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండే కాక, ఉభయ గోదావరి జిల్లాల, ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చే ఈ యాత్రకు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బెల్లాన ప్రసాద్, కంచుపల్లి అప్పన్న, సిరిపురపు త్రినాధ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.