Andhra PradeshVijayanagaram

కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ఆర్ధిక సహాయం

కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ఆర్ధిక సహాయం.

క్యాపిటల్ వాయిస్ (విజయనగరం జిల్లా) రామభద్రపురం

స్థానిక మండల కేంద్రం రామభద్రపురం కనిమెరక వీధికి చెందిన ఆర్కే యూత్ కిడ్నీ వ్యాధిగ్రస్తునికి పదివేల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించారు. గురువారం ఉదయం స్థానిక మండల కేంద్రంలో చందాన వీధికి చెందిన కటికి సింహాచలం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడంతో కనిమెరక వీధికి చెందిన ఆర్కే యూత్ తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు, గ్రామ ఉపసర్పంచ్ చింతల రామక్రిష్ణ చేతులమీదుగా పదివేల రూపాయిలు ఆర్ధిక సహాయం అందించారు. తమను ఆదుకున్నందుకు సింహాచలం కుటుంబ సభ్యులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ బవిరెడ్డి చంద్ర, నియోజకవర్గం తెలుగు యువత అద్యక్షుడు మజ్జి రాము, తెదేపా సీనియర్ నాయకులు చింతల చిన్నమ్మతల్లి, పూడి రామినాయుడు, కనిమెరక నాగేశ్వరరావు, మజ్జి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!