Andhra PradeshPalnadu
కేసు రాజీ పడకపోతే ఎన్ కౌంటర్ చేస్తా …..దాచేపల్లి సిఐ సురేంద్రబాబు పై ఆరోపణలు !

కేసు రాజీ పడకపోతే ఎన్ కౌంటర్ చేస్తా …..దాచేపల్లి సిఐ సురేంద్రబాబు పై ఆరోపణలు
సెల్ఫీదాచేపల్లి లో వీడియో కలకలం
రాములు నాయనాయక్ తీవ్ర ఆవేదన
క్యాపిటల్ వాయిస్ (పల్నాడు జిల్లా)గురజాల నియోజకవర్గం, కొత్తూరు :- నా తల్లి మంగా భాయ్ హత్య కేసులో రాజీకి రమ్మని దాచేపల్లి సీఐ ఎన్కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నారని సెల్ఫీ వీడియో విడుదల చేసిన కొత్తూరు కు చెందిన రాము నాయక్, గత ఏడాది జూలై 19 న దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామంలో మంగా భాయ్ అనే మహిళని ఆస్తి తగాదాల నేపథ్యంలో తన సొంత సోదరులు దాడి చేయగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మంగా భాయ్ మృతి చెందింది. దీనిపై కొడుకు రాము నాయక్ పోలీసులకు ఫిర్యాదుతో 13 మంది పై కేసు నమోదు చేశారు.మంగాబాయ్ హత్య కేసు లో రాజీ పడాలని దాచేపల్లి సిఐ ఒత్తిడితో సిఐ పై గత నెల క్రితం హై కోర్టులో కేసు వేసిన రాము నాయక్, అప్పటినుంచి దాచేపల్లి సిఐ నాపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి నన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నాడని, ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఐదుగురు కానిస్టేబుళ్లను తన ఇంటి వద్దకు పంపగా ఆసమయంలో నేను ఇంటి వద్ద లేక పోవడంతో అక్కడినుండి వారు వెళ్లారని వాళ్లు వచ్చిన విషయం నాకు తెలిసి నేను అజ్ఞాతంలోకి వెళ్లానని రాములు నాయక్ సెల్ఫీ వీడియోలో తెలిపారు.నాకు ప్రాణహాని ఉందని నాకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత దాచేపల్లి సిఐ సురేంద్ర బాబు ది అని ఎలాగైనా నా తల్లిని చంపిన వారికి శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సెల్ఫీ వీడియోలో రాములు నాయక్ తెలిపారు.