కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన
క్యాపిటల్ వాయిస్, రాచర్ల (ప్రకాశం జిల్లా) :-మోడీ ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రాచర్ల ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నిరసన తెలియజేసి అనంతరం రాచర్ల ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సిఐటియు రాచర్ల మండలం అధ్యక్ష కార్యదర్శులు ఏ .సుబ్బరాజు డి .థామస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి కార్మిక వర్గానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని ఈ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రం కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నమని అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ బిల్లు రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలనివిశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించ రాదని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఆదాయ పన్ను కట్టని కుటుంబాలకు నెలకు 7500 రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలని ఉపాధి హామీ పట్టణ ప్రాంతాలలో అమలు చేయాలని ఉపాధి హామీ పని గ్రామీణ ప్రాంతాలలో 200 రోజులకు పెంచాలని రోజు వారి కూలీ 600 రూపాయలు గా అమలు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి అమలుచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రాచర్ల మండల నాయకులు పి రాజశేఖర్ పాపయ్య ,రాజు మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.