కరోనాతో నిమ్మ కాయలకు తగ్గిన డిమాండ్….రైతుల ఢీలా !

కరోనాతో నిమ్మ కాయలకు తగ్గిన డిమాండ్….రైతుల ఢీలా !
క్యాపిటల్ వాయిస్, నెల్లూరు జిల్లా :- కరోనా వల్ల గత రెండు సంవత్సరాల నుంచి నిమ్మ కాయ ల కు డిమాండ్ తగ్గుతుందని, ప్రస్తుతం పొదలకూరు మార్కెట్ లో ఎనిమిది వందల కంటే ఎక్కువగా ధర లే దని నిమ్మ మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆట్ల ప్రభాకర రెడ్డి తెలిపారు.పొదలకూరు మార్కెట్ లో ఈ సమయంలో కాయలు తక్కువగా రా వా ల ని. గత మూడు నెల్ల నుంచి వర్షాలు రాకపోవడం తొ కాయలు ఇప్పుడు ఎకువ గా వస్తున్నాయని డిమాండ్ లేదని అన్నారు. కాయలు కోయంచి మార్కెట్ కు తీసుకు రావడానికి ఆరు వందల వరకు ఖర్చు అవుతుందని రైతు కు వంద రూపాయలు కూడా బస్తా మీద మిగిలే పరిస్థితి లేదన్నారు.విజయదశమి వరకు కొంత ధర పలికినా దీపావళి కి తగ్గిపోయి దని అన్నారు. ప్రతి రోజు పొదలకూరు మార్కెట్ నుంచి ఆరేడు లారీల నిమ్మకాయ లు ఎగుమతి అవుతూ యన్నారు. నిమ్మకాయలను నార్త్ కు పంపాలంటే బస్తా కు అదనంగా మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అని అన్నారు.ఈ సమయంలో ఏలూరు, తెనాలి మార్క్ ట్ ల లో నిమ్మకాయలు ఎక్కువగా ఉండాలని, పొదలకూరు మార్కెట్లో తక్కువ గా వుండాలని కానీ పొదలకూరు మార్కెట్లో ధర లేని సమయంలో కాయలు డిమాండ్ కు మించి వస్తున్నని ఆట్ల ప్రభాకర రెడ్డి తెలిపారు.