Andhra Pradeshkrishna
కాలుష్య కోరల్లో జగ్గయ్యపేట….. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీనే కారణమా?

కాలుష్య కోరల్లో జగ్గయ్యపేట….. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీనే కారణమా ?
క్యాపిటల్ వాయిస్, కృష్ణాజిల్లా ప్రతినిధి :- ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేది మేజర్ గా కర్మాగారంలో ఉద్యోగ,కార్మికులు,ట్రాన్స్ పోర్టు మరియు కిరాయి వారేనన్న ప్రజల నుండి వాదనలు లేకపోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన గ్రామంలో ఉన్న ఓటరు మరియు ప్రజలెందరు. వారిలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనే వారి సంఖ్య ఎందరో ఆధార్ కార్డుల ఆదారంగా అధికారులు వాస్తవాలను బహిర్గతం చేసేనా ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల అభిప్రాయాని అధికారులకు వ్యక్తం పరిచే పరిస్థితి ఏమైన ఉందా ? ఇప్పటికైన ప్రభుత్వం,జిల్లా,స్థానిక అధికారులు ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది అనగా వందకి వంద శాతం స్థానికులను భాగస్వామ్యం చేసి వాస్తవ పరిస్థితులను వారికి ప్రభుత్వ అధికారులు విశ్లేషించి స్థానిక మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.ఆ విధంగా జరగడం లేదని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.ఆదాయం కర్మాగారానికి కాలుష్యం ప్రజలకి, దీనివల్ల ఆరోగ్యాలు పాడౌతూ పర్యావరణం సమతుల్యత దెబ్బ తింటుందని,తద్వార ఏమి జరిగిన స్థానికులు అడిగే పరిస్థితి లేదని స్థానిక ప్రజల తరపున సామాజిక కార్యకర్త మెటికల శ్రీనివాసరావు అధికారులను కోరారు.