కళానగర్ పార్క్ స్థలాన్ని ఆక్రమణనుండి కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి!

కళానగర్ పార్క్ స్థలాన్ని ఆక్రమణనుండి కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి!
క్యాపిటల్ వాయిస్ విశాఖపట్నం :మధురవాడ ప్రతినిధి
జోన్ 2 మధురవాడ కళా నగర్ కాలనీలో లగుడు.జగదీశ్వరి తన సొంత స్థలాన్ని విక్రయంచి కలానగర్ పార్క్ స్థలం లో పదిహేను సంవత్సరాల నుండి పూరి గుడిసె నిర్మించుకొని ఆవులను పెంచుకుంటూ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆవులు, గేదెలు కూడా రోడ్ మీద కట్టి అక్కడ పాడుచేసి పరిశుభ్రతకు కూడా భంగం కలిగిస్తున్నారు, వాటి వల్ల దోమల సమస్యలు కూడా వున్నాయి. కావున ఇప్పుడు కలానగర్ అభివృద్ధి లో భాగంగా పార్క్ ని అభివృద్ధి చేసే పనిలో జీవీఎంసీ అధికారులు కొద్ది రోజుల క్రితం కాళీ చేయమని చెప్పగా వెళ్లిన అధికారులపై దుర్భాషాలు ఆడి చచ్చిపోతానని బెదిరిస్తున్నారని అధికారులు కలానగర్ స్థానిక సభ్యులు చెప్తున్నారు. స్థానికులు పూర్తిగా లగుడు జగదీశ్వరి కి ఆస్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిందని అప్పటిలో వారికి చెప్పిన ఎవరి మాట పట్టించుకోలేదని ఇప్పుడు తన స్థలాన్ని విక్రయించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వచ్చిన అధికారుల పై తిరగబడటం సరికాదని ఇటువంటి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని కళానగర్ పార్క్ స్థలం కాపాడి కళానగర్ ప్రజలకు అప్పగించాలని స్థానికులు కోరుకుంటున్నారు.