కాకినాడలో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

కాకినాడలో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే అనుచరుల దాడి
క్యాపిటల్ వాయిస్, కాకినాడ :- టీడీపీ నేతలు కొండబాబు, నవీన్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వైసీపీ నేతలు, మత్స్యకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.తూర్పు గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాకినాడలోని జిల్లా టీడీపీ ఆఫీసును వైఎస్సార్ సీపీ శ్రేణులు, మత్స్యకారులు ముట్టడించే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు కొండబాబు, నవీన్ పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తుండగా వైసీపీ నేతలు, మత్స్యకారులు ఒక్కసారిగా దాడికి దిగారు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల కొమ్మారెడ్డి పట్టాభి చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి మద్దతుదారులు, మత్స్యకారులు, బోటు నిర్వాహకులు టీడీపీ నేతలపై దాడి చేశారని నేతలు ఆరోపించారు.