జియో 5జి ఫోన్ అతి చౌక ధరలో …..ఇది విన్నారా !?

జియో 5జి ఫోన్ అతి చౌక ధరలో ……..ఇది విన్నారా !?
క్యాపిటల్ వాయిస్, సాంకేతిక సమాచారం :- జియో 5జి ఫోన్ రిలయన్స్ సంస్థ కు చెందిన జియో కంపెనీ త్వరలో గంగా అనే కోడ్ పేరుతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది.ఈ స్మార్ట్‌ఫోన్లో ఉన్న ఫీచర్లేంటి.. ఎంత బడ్జెట్ లో
వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..జియో 5జి ఫోన్ భారతదేశంలో అతిపెద్ద టెలికాం మార్కెట్ లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రిలయన్స్ జియో. ఇప్పటికే చౌకైన ధరకే రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన జియో తాజాగా జియో 5జీ గంగా అనే కోడ్ తో మరో ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు లీకులిస్తోంది. కొత్తగా వచ్చే ఈ ఫోన్లో గతంలో కంటే మెరుగైన హార్డ్ వేర్, లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయని ప్రకటించింది. ఈ గంగా 5జీ ఫోన్ లాంఛింగ్ ఈ సంవత్సరంలోపే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అది కూడా ప్రధాన పండుగ దీపావళి నాడు ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఈ కంపెనీ తాజాగా లాంచ్ చేసే ఫోన్ తక్కువ ధరకే అది కూడా 6 వేల
రూపాయలలోపు జియో 5జి గంగా ఫోన్ పేరిట స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఈ ఫోన్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు, బ్యా్క్‌సైడ్ క్యాప్సూల్ డిజైన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. AI టెక్నాలజీతో 13ఎంపి ప్రైమరీ కెమెరా
ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ ఫోన్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందించే 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో వస్తుంది. అంతేకాదు 4GB+32GB వేరియంట్లో రానుంది. దీని డిస్ ప్లే కూడా 6.5 Inches ఎల్సి డి హెచ్డి డిస్‌ప్లేతో అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఫోన్ ధర కూడా రూ. 6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ లో
రానుంది.