Andhra PradeshUncategorizedVisakhapatnam
“జావేద్” తుఫాన్ పొంచివున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

“జావేద్” తుఫాన్ పొంచివున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి.5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
“జావేద్” తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు, వార్డ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని Gvmc 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ప్రకటన ద్వారా తెలిపారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతలు అయిన శారదనగర్, గాంధీ నగర్, శీవసక్తినగర్,అయ్యప్పనగర్, వికలాంగుల కొలనీ,కార్పెంటర్ కొలని,స్వయంకృషి నగర్,సాయిరాం కొలనీ, ప్రజలు మరియు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు ఎదురైన యెడల టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 లేదా 0891 – 2869106కు తెలియపరచాలని కోరారు. జివిఎంసి అధికారులు, సిబ్బంది నగరంలో ఉండి ఎటువంటి విపత్తులైనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ముందస్తు చర్యగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంత ప్రజలు, కొండవాలు ప్రాంత ప్రజలను కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు, సిబ్బంది ఆదేశించారు. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. వార్డ్ లో పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఎవరూ ఉండరాదని, గెడ్డలు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు వరద సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్డ్ లో ఉన్న ప్రజలందరికీ సూచించారు.
