జాతిపితను అవమానించిన విక్టర్ రాజీనామా చేయాలి……. లంకిశెట్టి

జాతిపితను అవమానించిన విక్టర్ రాజీనామా చేయాలి……. లంకిశెట్టి
క్యాపిటల్ వాయిస్ (కృష్ణా జిల్లా)మచిలీపట్నం :- జాతిపిత మహాత్మా గాంధీ పట్ల ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మచిలీపట్నంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం మెచ్చిన మహా నాయకుడు స్వాతంత్ర సంగ్రామంలో అహింసవాదంతో పోరాడిన మహాత్మా గాంధీ పట్ల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ చేసిన చర్యలు సరి అయింది కాదని లంకిశెట్టి అన్నారు. విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు పలు వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మహనీయుడి మీద అటువంటి వ్యాఖ్యలు సరికావని బాలాజీ అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ విక్టర్ ప్రసాద్ వ్యాఖ్యలు తమ పార్టీకి సంబంధం లేదని అనటం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకొని జరిగిన తప్పును సరిదిద్దాలని బాలాజీ డిమాండ్ చేశారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి క్యాబినెట్ హోదాలో ఉన్న వ్యక్తి విక్టర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని బాలాజీ అన్నారు. తక్షణమే విక్టర్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు.