Andhra PradeshPrakasham
జాతీయ స్థాయిలో మెరిసిన కొమరోలు కుర్రాళ్ళు

జాతీయ స్థాయిలో మెరిసిన కొమరోలు కుర్రాళ్ళు
క్యాపిటల్ వాయిస్, కొమరోలు :- ప్రకాశంజిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఫుడ్ బాల్ పోటీల్లో పాల్గొని వినర్స్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఉత్తర ప్రదేశ్ లోని మధుర లో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బాల్ పోటీల్లో కొమరోలుకు చెందిన ముగ్గురు క్రీడాకారులు డి.శ్రీనివాస రెడ్డి, డి.శివ సుబ్రహ్మణ్యం, కె.రామాంజనేయులు ఉత్తరాఖండ్ రాష్ట్ర జట్టుతో తలపడి గోల్డ్ మెడల్ సాధించి కొమరోలు కి పేరు తీసుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి 18 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఫుడ్ బాల్ పోటీలకు ఎంపిక కాగా వారిలో ఈ ముగ్గురు క్రీడా కారులు మెయిన్ టీమ్ లో ఉండి గెలుపుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు క్రీడా కారులను పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయుడు కదిరి విజయ్ కుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు విశ్వరూపాచారి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.