జగ్గయ్యపేటలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీల వివాదాలు

జగ్గయ్యపేటలో కలకలం రేపుతున్న ఫ్లెక్సీల వివాదాలు
క్యాపిటల్ వాయిస్ (ఎన్టీఆర్ జిల్లా) జగ్గయ్యపేట :- తెలుగుదేశం పార్టీ నేత బొల్లా రామకృష్ణ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నేడు నారా చంద్రబాబు నాయుడు జగ్గయ్యపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రామకృష్ణ అభిమానులు సానుభూతిపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపి వేయడం అమానుష చర్య అని తెదేపా నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ కష్టం వస్తే తానున్నానంటూ అండగా నిలుస్తున్న రామకృష్ణ ఎదుగుదలను ఓర్వలేక కొందరు హింసను ప్రేరేపించే విధంగా ఈ రకమైన పనులు చేస్తున్నారని నియోజకవర్గ తెదేపా రాజకీయ ప్రముఖులు గుసగుసలాడుతున్నారు ఏది ఏమైనాప్పటికీ పార్టీ సిద్ధాంతాల మేరకు తాను ప్రజల్లోనే ఉంటానని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల మనిషిగా ఉంటానని నియోజకవర్గంలో ఫ్లెక్సీలను తీసేసినంత సాధారణంగా ప్రజల మనసులో నుండి తనను తీయలేరని రామకృష్ణ వెల్లడించారు. ఫ్లెక్సీలను చించడంలో ఉన్న దృష్టిని ప్రజా సమస్యలను తీర్చడంలో పెట్టాలని ఎద్దేవా చేశారు.