Andhra PradeshPrakasham
జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే ఘన విజయాన్ని సాధించి పెట్టాయి : ఎమ్మెల్యే అన్నా

జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే ఘన విజయాన్ని సాధించి పెట్టాయి : ఎమ్మెల్యే అన్నా
క్యాపిటల్ వాయిస్, బేస్తవారి పేట :-సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలే మనకు ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టాయని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అన్నారు.ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీటీసీల, ఎంపిపి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి ఒక్కరు ప్రజలకు సేవలు అందించి ప్రజాసేవకు అంకితం కావాలని అన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపిటిసిలకు ఆయన శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన ఓసూరా రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.