jobs

ఇండియన్ రైల్వే సూపర్ శుభవార్త……… పదవ తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు

ఇండియన్ రైల్వే సూపర్ శుభవార్త……… పదవ తరగతి  అర్హతతో భారీగా ఉద్యోగాలు

క్యాపిటల్ వాయిస్, ఉద్యోగ సమాచారం :-  సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 548 అప్రంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్ పూర్ (సొత్ సెంట్రల్ రైల్వే) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  భారీగా అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 548 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ  ఇప్పటికే అంటే మే 3న ప్రారంభమైంది.దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 3ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 23:59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.మొత్తం 548 ఖాళీలు ఉండగా.. ఇందులో కార్పెంటర్, డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్, స్టెనో (ఇంగ్లీష్), స్టెనో (హిందీ), వెల్డర్, వైర్ మెన్, డిజిటల్ ఫోటో గ్రాఫర్ తదితర ట్రేడ్ లలో ఖాళీలు ఉన్నాయి. ఇంకా వయోపరిమితి విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు జూలై
1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి. పలు వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు.  ఆ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.విద్యార్హతలు: టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐ టి ఐ / ఎన్ సి వి టి  సర్టిఫికెట్
కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్: 

https://www.apprenticeshipindia.gov.in/candidate-login

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!