Andhra PradeshVisakhapatnam

ఐక్యతకు చిహ్నంగా అలరించిన చిన్నారుల బొజ్జ గణపయ్య

ఐక్యతకు చిహ్నంగా అలరించిన చిన్నారుల బొజ్జ గణపయ్య
క్యాపిటల్ వాయిస్:(విశాఖ జిల్లా) మధురవాడ:- వినాయక చవితి వస్తే చాలు అంగ రంగ వైభవంగా జరిపించుటకు అన్ని వయస్సుల వారు ముందుకు వచ్చి పందిర్లు వేసి మండపం ఆవరణమంతా క్రాంతి వంతంగా చేసి ఎంతో వైభవంగా డి జె లు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు.కాని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మధురవాడ ప్రాంత స్వతంత్ర నగర్ కోలనీ లో ఉన్న ఓ చిన్న పాటి వీధికి చెందిన ముప్పై గృహాలలో ఉన్న బాల బాలికలు ఐకమత్యాన్ని చాటుకుంటూ పెద్దలను సైతం ఒక్కటిగా చేసే ఐక్యతా రాగాన్ని వారి మదిలో తలపించే విధంగా బాల గణపతి యూత్ పేరిట ఓ  బాల బొజ్జ గణపతికి మండపము ఏర్పాటు చేసి వినాయకునికి పూజలు నిర్వహించారు.పర్యావరణానికి ఎటువంటి హానిని తలపెట్టకుండా ఉండుటకు మట్టి విగ్రహాన్ని మాత్రమే తయారుచేయించి ధ్వని కాలు‌ష్యానికి తావివ్వకుండా ఎవరికీ ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండ్రాళ్ళ దేవుడిని స్మరించాలని బాలల ఆకాంక్ష.వీరికి పెద్దలు సైతం ముందుకొచ్చి వారికి తోడై పూజలు జరిపిస్తున్నారు.ఈ పూజా మహోత్సవాలు ఐదురోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొంటూ అనుపురోజున అన్నసమారాధన ఏర్పాటుకు సైతం సిద్ధమవుతున్నట్లు  ఆ బాలలు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!