Andhra PradeshPrakasham
ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్ కు ఘోర అవమానం….?
ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్ కు ఘోర అవమానం….?
ఎవరైతే నాకేంటి టోల్ రుసం కట్టాల్సిందే నంటూ జిల్లా కలెక్టర్ వాహనం అడ్డగింత..
అత్యుత్సాహం చూపిన టోల్ ప్లాజా సిబ్బంది
టోల్ ఫ్లాజా సిబ్బందిపై కేసులు నమోదుకు ఆదేశం
క్యాపిటల్ వాయిస్, (జిల్లాప్రతినిధి) ఒంగోలు :- ఎవరైతే నాకేంటి…. టోల్ రుసం కట్టాల్సిందే నంటూ ….జిల్లా కలెక్టర్ వాహనం అడ్డగింత, అత్యుత్సాహం చూపిన టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. .టోల్ ప్లాజా నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్ ఘోర అవమానానికి గురువారం గురయ్యారు. వివరాల్లో కి వెళ్తే మార్కాపురం పట్టణంలో జరగనున్న విద్యాధికారుల సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ వాహనాన్ని త్రిపురాంతకం మండలం మేడపి టోల్ ప్లాజా వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. ప్రభుత్వ వాహనం ఏ లిఖించి ఉండి సంబంధిత కార్ డ్రైవర్, ఐఏఎస్ అధికారి వాహనం అని ఆన్ డ్యూటీ అంటూ తెలిపినప్పటికీ సిబ్బంది ససేమిరా అంటూ ఎవరైతే నాకేంటి టోల్ ఫీజు కట్టి తీరాల్సిందే అంటూ దాదాపు 20 నిమిషాల పాటు వాహనాన్ని అడ్డగించి ఐఏఎస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయాన్ని సంబంధిత కారు డ్రైవర్ త్రిపురాంతకం తాసిల్దారు వి కిరణ్ కు ఎస్ ఐ కృష్ణయ్యకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్ కిరణ్ కుమార్ హుటాహుటిన టోల్ ప్లాజా వద్దకు చేరుకొని టోల్ ప్లాజా సిబ్బంది విధినిర్వహణలో సత్ప్రవర్తన కలిగి ఉండాలని విధి విధానాలు తెలుసుకొని మసలుకోవాలని హెచ్చరించారు. బాధ్యతారహితంగా మసలుకో ని టోల్ ఫ్లాజా సిబ్బందిపై కేసులు నమోదు చేసేందుకు ఆదేశించారు. ఈ సంఘటన అనంతరం టోల్ ప్లాజా సిబ్బంది ప్రవర్తన తీరుపై పలువురు పలు రకాలుగా ఆరోపణలు చేశారని వినికిడి.