హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. ఇద్దరు మృతి ?

హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. ఇద్దరు మృతి ?
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా కారణంగానే పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. టపాసులు ఒకే చోట పెట్టి కాల్చడం.. వాటికి రసాయనాలు కూడా కలడంతో.. పేలుడు తీవ్రత ఎక్కువయందని వెల్లడించారు. దీపావళి వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీ లో తీవ్ర కలకలం రేగింది. ఛత్రినాక పరిధిలోని కందికల్ గేట్ వద్ద గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది. మృతులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా గుర్తించారు. వీరు పీవోపీ విగ్రహాల తయారీ కేంద్రంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. రాత్రివేళ పేలుడు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని వణికిపోయారు. ఐతే విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా కారణంగానే పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. టపాసులు ఒకే చోట పెట్టి కాల్చడం.. వాటికి రసాయనాలు కూడా కలడంతో.. పేలుడు తీవ్రత ఎక్కువయందని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్‌నామా ఏసీపీ తెలిపారు.దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చడం సంప్రదాయంగా వస్తోంది. ఇంటి ఆవరణలో దీపాలు పెట్టడంతో పాటు.. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చుతారు. ఐతే టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఏటా ప్రభుత్వాలు, నిపుణులు చెబుతూనే ఉంటారు. ఐనప్పటికీ పేలుడు, అగ్నిప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అంతేకాదు టపాసులు కాల్చుతూ ఎంతో మంది గాయపడ్డారు. వారంతా నగరంలోని సరోజిని కంటి ఆస్పత్రికి క్యూకట్టారు. గాయపడ్డ వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని డాక్టర్లు చెప్పారు.