Andhra Pradeshkrishna
ఏ రోడ్లు చూసినా గుంతలే..తట్టడు మట్టి కూడా పోయని ప్రభుత్వం

ఏ రోడ్లు చూసినా గుంతలే..తట్టడు మట్టి కూడా పోయని ప్రభుత్వం
ప్రభుత్వ జగనన్న గుంతల పథకంగా మారిన రోడ్లు
బూతిమిలిపాడు రోడ్డులో టీడీపీ అధ్వర్యంలో నిరసన
క్యాపిటల్ వాయిస్, కృష్ణాజల్లా ప్రతినిధి :- రాష్ట్రంలో ఏ రోడ్లు చూసినా గుంతలమయంగా ఉన్నాయని, ఆ గుంతలలో తట్టెడు మట్టి కూడా పోయడంలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా విమర్శించారు. రెండేళ్ల వైసీపీ పాలనలో గుంతలను పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సంక్షేమం పేరుతో భాజానాను ఖాళీ చేశారేగానీ, ఎక్కడా చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సమీపంలో గన్నవరం-మానికొండ ఆర్ అండ్ బీ రోడ్డుపై ఉన్న గుంతల వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా రోడ్ల నిర్వహణపై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి చిన్నా మాట్లాడుతూ..రెండేళ్లలో రాష్ట్రం అప్పులు తప్ప అభివృద్ధి చెందలేదని చెప్పారు. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఢిల్లీలో అప్పుల కోసం ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పడిగాపులు పడుతున్నారని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని రహదారులు నరకానికి నకళ్లుగా… మారాయని విమర్శించారు. ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ ప్రాంతాల రోడన్లు కూడా నిర్వహించలేని దుస్లితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు.ఎక్కడపడితే అక్కడ రోడ్లపై గుంతలు ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, బాపులపాడు మండల ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, పార్టీ నాయకులు కంభంపాటి సుభాష్ చంద్రబోస్, నిమ్మకూరి మధు, మురళీ, తెలుగు రైతు బావులపాడు మండల అధ్యక్షుడు మొవ్వా వెంకటేశ్వరరావు, తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి, నాయకులు మండవ లక్ష్మీ, చిక్కవరపు నాగమణి, తెలుగు యువత మండల అధ్యక్షుడు చీమలదండు రామకృష్ణ, నాయకులు మండవ అన్వేష్, బాలు, నిమ్మకూరి జయమోహన్, టీఎన్ఎస్ఎఫ్ మచిలీపట్నం పార్లమెంటు కార్యదర్శి వల్లగాని కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.