Andhra Pradeshkrishna
వీరవల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన తెలుగుదేశం పార్టీజాతీయ, రాష్ట్ర నాయకులను పరామర్శించిన బాపులపాడు టిడిపి నేతలు

వీరవల్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన తెలుగుదేశం పార్టీజాతీయ, రాష్ట్ర నాయకులను పరామర్శించిన బాపులపాడు టిడిపి నేతలు
క్యాపిటల్ వాయిస్, కృష్ణా జిల్లా :- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ మంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరరావు గారి పై జరిగిన దాడికి మద్దతుగా బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే బొడే ప్రసాద్ గారు,తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గారు మరియు TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామ రాజు గారిని జి.కొండూరు నుండి వీరవల్లి పోలీస్ స్టేషన్ కిఈరోజుఅర్దరాత్రి1గంటకుతీసుకువచ్చినప్పటినుండివాళ్ళతోఉండి తెల్లవారుజామున 4 గంటలకుబెయిల్ ఇచ్చెవరకు మచిలీపట్నం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు గారు,హనుమాన్ షుగర్స్ మాజీ చైర్మన్ గుండపనేని ఉమా వర ప్రసాద్ గారు,మచిలీపట్నం నియోజకవర్గం టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిచెన్నుబోయిన శివయ్యలు తదితరులు ఉండి సంఘీభావం తెలియచేసారు. అనంతరం ఇదే విషయమై ఈరోజు ఉదయం బాపులపాడు మండల టిడిపి నేతలు వీరవల్లి నుంచి పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతి,అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? వైసీపీ నేతలు ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరపున తెలుగుదేశం నేతలు అడ్డుకోవడం తప్పా?. మీ అవినీతిని అడ్డుకుంటే దాడులు, మైనింగ్ ని అడ్డుకుంటే హత్యయత్నాలు,బెదిరింపులకు పాల్పడుతారా? ఒక్కరిపై 100 మంది వైసీపీ గూండాల దాడి పిరికిపింద చర్య, మైలవరం ఎమ్మెల్యే వసంత క్రష్ణప్రసాద్ ప్రోథ్బలంతోనే ఈ దాడి జరిగిందని, ఈ ఘటనలో నిందితులపై హత్యయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలకు కూడా వదలకుండా దోచుకుంటున్నారు. ప్రజా సందపను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రజలను సంపదను దోచేస్తున్నారు అని తీవ్రం గా విమర్శించారు. అదికార మదంతో రాష్ట్రము లో వైసీపీ నేతల అవినీతి, అరాచాకాలు పెరిగిపోయాయి అని, ముందురోజుల్లో వైసీపీ నేతలు చేసిన అవినీతికి, అరాచకాలకు చక్ర వడ్డీతో సహా మూల్యం చెల్లించకతప్పదు అని అన్నారు.ఈకార్యక్రమం లో వీరవల్లి మాజీ సర్పంచులు పిల్లా రామా రావు,అమృతపల్లి సూర్య నారాయణ ,తెలుగు యువతనాయకులు మండాది రవీంద్ర, ఆళ్ళ సుధాకర్ , లింగంనేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.