Andhra PradeshNellore
సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమ గ్రావెల్ నిర్వహకులను అరెస్టు చేసి లైసెన్స్లు రద్దు చేయాలి….?

సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమ గ్రావెల్ నిర్వహకులను అరెస్టు చేసి లైసెన్స్లు రద్దు చేయాలి….?
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- గత వారం రోజులు గా సర్వేపల్లి రిజర్వాయర్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమాల అవినీతి పై ప్రజా సంఘాల ఆద్వర్యంలో వెన్నెలకంటిబ రాఘవయ్య భవన్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రజాసంఘాల నాయకులు పి.టోని బాబు మాట్లడుాతుా సర్వేపల్లి రిజర్వాయర్ లో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోకుండా అధికారులు అక్కడ జరిగే పరిణామాలను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం హాస్యస్పదంగా ఉందని ఈ జిల్లాలో అధికార యంత్రాంగం ఉందో లేదో అర్దంకావడం లేదని ఎద్దేవా చేసారు.భాద్యతయుతంగా వ్యవహరించాల్చిన అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వు దోంగ అంటే నువ్వే దొంగ అని గగ్గోలు పెడుతుా అసలు దొంగలు పారిపోయేలా ప్రవర్తిస్తుా జిల్లా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్వక్తం చేశారు. ఇంత జరుగుతున్న ఇరిగేషన్ మైనింగ్ డిపార్ట్మెంట్ లొ ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. దీనికి ప్రదాన భాద్యులైన ఇరిగేషన్ ఈ ఈ , మైనింగ్ డి డి లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు ప్రజాసంఘాల ఆద్వర్యంలో సర్వేపల్లి రిజ్వరాయర్ కంటేపల్లి అటవి ప్రాంతాల లో నిజ నిర్దారణ కమిటీ పర్యటిస్తుందని తెలిపారు.పై కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్లంకి. వెంకటేశ్వర్లు,పి.ఆదిత్య సాయి, పి.లీలా మెాహన్, కన్నా. వెంకట్, శ్యామ్,హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.