Andhra PradeshPrakasham
సచివాలయ మహిళా పోలీసులకు ఎస్ ఐ బ్రహ్మనాయుడు అవగాహన

సచివాలయ మహిళా పోలీసులకు ఎస్ ఐ బ్రహ్మనాయుడు అవగాహన
క్యాపిటల్ వాయిస్, గిద్దలూరు :- ప్రకాశం జిల్లా గిద్దలూరులో గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు ఎస్సై బ్రహ్మనాయుడు మంగళవారం
అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళ పోలీసులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. గ్రామాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచాలని నాటుసారా మద్యం పేకాట తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని అన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఒక కంట కనిపెట్టి ఉండాలని స్కూళ్లు కాలేజీల వద్ద విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారి ఆట కట్టించాలిసిన బాధ్యత మీపై ఉందని వారికి తెలిపారు.