ప్రభుత్వ కార్యాలయాలలో ఏసిబి బోర్డులను ఏర్పాటు చేయాలి : సిసిఅర్ జిల్లా కో కన్వీనర్ భూపని వెంకటేశ్వర్లు

ప్రభుత్వ కార్యాలయాలలో ఏసిబి బోర్డులను ఏర్పాటు చేయాలి : సిసిఅర్ జిల్లా కో కన్వీనర్ భూపని వెంకటేశ్వర్లు
క్యాపిటల్ వాయిస్, గుంటూరు జిల్లా ప్రతినిధి :- యంత్రాంగం లో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడం కోసం చట్టాలను బలోపేతం చేయాలని ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం బోర్డులు మరియు అవినీతి నిరోధక శాఖ ఎసిబి నంబర్ లను సిటిజన్ చార్టర్ లను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల సంస్థ గుంటూరు జిల్లా కేంద్రంలో కలెక్టర్ మరియు జిల్లా ఏసీబీ ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని జిల్లా కో కన్వీనర్ మరియు జోనల్ ప్రెస్ సెక్రెటరీ అయిన భూపని వెంకటేశ్వర్లు అందజేయడం జరిగింది.
అవినీతిని బహిర్గతం చేయడానికి ఆర్టీఐ చట్టం ఒక్కటే మార్గమని ప్రతి పౌరుడు ఆర్టీఐ గురించి తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భవిష్యత్ లో గ్రామ స్థాయిలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఇందులో భాగంగా రికార్డుల తనిఖీ కి సంబంధించిన అవగాహన మరియు ట్రైనింగ్ చేపడతాం అన్నారు. ఈ విషయం పై వుర్చ్యువల్ పద్దతిలో ఆ సంస్థ ఫౌండర్ మంచికట్ల అనిల్ కుమార్ మరియు ఏపీ స్టేట్ ఆర్టీఐ సెక్రెటరీ అయిన డా. ఈ.లక్ష్మీ ప్రశాంత్ , రాష్ట్ర అడ్మనిస్ట్రేటివ్ సెక్రెటరీ అయిన బత్తిన శ్రీనివాసరావు ఈ సందర్భంగా అవినీతిని వెలికితీసిన లేదా ఏసీబీ దృష్టికి తీసుకువచ్చిన వారికి సంస్థ తరుపున గౌరవ సన్మానం అవార్డు మరియు సర్టిఫికెట్ కూడా అందజేస్తాం అన్నారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ భుపని వెంకటేశ్వర్లు , అడ్వకేట్ దీపక్ దయానంద్ , తదితర జిల్లా బృందం పాల్గొన్నారు.