మేము మనుషులమే… మాపై దయ చూపండి

మేము మనుషులమే… మాపై దయ చూపండి
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- అభివృద్ధికి చాలా దూరంలో జీవిస్తున్న బర్దన్ నగర్ కాలనీ వాసులు ప్రభుత్వం నుంచి కనీస సౌకర్యాలు కూడా అందని పేద బ్రతుకులు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం 97 వ వార్డు సుజాతనగర్ లో ఉడాకాలనీ దగ్గరలో ఉన్న బర్దన్ నగర్ కాలనీ వాసులు కనీస సౌకర్యాలు కూడా అందక దీనస్దితిలో జీవిస్తున్నారు. ఇక్కడ సుమారు 150 కుటుంబాల పేద ప్రజలు జీవిస్తున్నారు ఇక్కడ నివసించే వారందరు కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిది 97 వ వార్డు లో జీవిస్తు కనీసం విద్యుత్ సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యానికి ఒక బోరు మాత్రమే ఉండటం వలన ఈ కాలనీ వాసులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. బోరు నీరు వాడకానికి మంచినీటికి ఒక వాటర్ ట్యాంకు నీరు వస్తున్నాయి కాని మాకు త్రాగడానికి సరిపోవడం లేదని కాలనీ వాసులు మంచి నీటికి తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని వాపొతున్నారు. కనీసం కరెంటు సౌకర్యమైనా ఉంటే పిల్లలు రాత్రిపూట బాగా చదువుకొని ప్రయోజకులవుతారని అంటున్నారు. రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటం వలన పిల్లలు చదువు కోవడానికి, నిత్య అవసరమైన సరుకులు కొనుగోలు చేయడానికి ఎటువెల్లిన రెండున్నర కిలోమీటర్లు వెళ్లాలి. అలా వెళ్లేటప్పుడు రోడ్డు సౌకర్యం బాగోలేకపొవడం వలన చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని బర్దర్‌నగర్ కాలనీవాసులు చాలా బాదపడుతున్నారు. ముఖ్యంగా కరెంటు సౌకర్యం లేకపోవడం వలన చీకటి పడితే విష పురుగులు ,పాములు,తేళ్లు కీటకాల వలన రాత్రి పూట తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని బర్దర్ నగర్ కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్దానిక ప్రజాప్రతినిదులు, జి వి యమ్ సి అదికారులు తక్షణమే స్పందించి మా బర్దర్ నగర్ కాలనీకి కరెంటు సౌకర్యం ఇతర సౌకర్యాలు ఇప్పించగలరని బర్దర్ నగర్ కాలనీ వాసులు కోరుకుంటున్నారు.