Andhra PradeshNellore
జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే వెంకటేశ్వర్లు ఎంపిక

జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే వెంకటేశ్వర్లు ఎంపిక
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అధినేత పవన్కళ్యాన్ తన పై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టత కోసం పని చేస్తానని తెలిపారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ .పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినెటర్ కల్యాణం శివ శ్రీనివాస్(కేకే) జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తో పాటు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు.