Andhra PradeshGuntur
జగనన్న పాలనలో అన్ని గోవిందా !?

జగనన్న పాలనలో అన్ని గోవిందా !?
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు) సత్తెనపల్లి :- ఈనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశంపార్టీ నాయకుల ఆందోళన జగనన్న పాలనలో తిరుపతి బంగారం గోవిందా గోవిందా, విశాఖ ఉక్కు గోవిందా గోవిందా,విశాఖ భూములు గోవిందా గోవిందా,అమరావతి నిర్మాణం గోవిందా గోవిందా, ఇసుక విధానం గోవిందా గోవిందా,ఎస్బిఐ బ్యాంక్ ఇచ్చిన 15 వేల కోట్లు గోవిందా గోవిందా, ఇండియన్ బ్యాంక్ ఇచ్చిన 10 వేల కోట్లు గోవిందా గోవిందా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన 9 వేల కోట్లు గోవిందా గోవిందా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చిన 10 వేల కోట్లు గోవిందా గోవిందా. పోలవరం నిర్మాణం గోవిందా గోవిందా, మద్యం మీద వచ్చే ఆదాయం గోవిందా గోవిందా, మొత్తం మీద జగన్ ప్రజలకు ఇచ్చిన మాట గోవిందా గోవిందా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల గారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ చేతకాని పాలనపై ప్లే కార్డ్స్ చేతబట్టి తమ ఆందోళన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ పెద కరిముల్లా పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు. 29వ వార్డు కౌన్సిలర్ షేక్ జానీ భాష కొమెరపూడి సంగం డైరీ అధ్యక్షులు యర్రా వెంకటేశ్వరరావు. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ నబీపార్టీ నాయకులు దర్శి సురేష్, గుర్రం వెంకటేశ్వరరావు, రాంబో బుడే, బండారు నాగరాజు, దర్శి శేఖర్, శిఖ ఏడుకొండలు, నూరు బాషా జాన్ బాబు, సయద్ సైదా, కల్లూరి చంద్ర శేఖర్, దొడ్లేరు సైదా,గొల్లపల్లి వీరాంజనేయులు, మద్దిగుంట్ల నరసింహారావు, ఎం వెంకటేశ్వర్లు,చిలకా కిరణ్ దితరులు పాల్గొన్నారు.