AnanthapurAndhra Pradesh
గోమాతను కాపాడుకుందాం… హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం

గోమాతను కాపాడుకుందాం… హిందూ ధర్మాన్ని రక్షించుకుందాం
క్యాపిటల్ వాయిస్ (అనంతపురం జిల్లా ) నల్లమాడ మండలం :- స్థానిక మండల కేంద్రంలోని నల్లమాడ లో హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోమాతను కించపరచి మాట్లాడడం వైయస్సార్ నాయకులకు ఇది మంచిది కాదని హితవు పలికారు. హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి పూనుకున్నారని కేంద్రంలో బీజేపీ అట్టడుగు వర్గాల వారిని కూడా అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నత స్థాయికి చేరడం కూడా ఓర్వలేక వై ఎస్ ఆర్ సి పి ఇటువంటి నీచమైనటువంటి అనే రాజకీయాలను ఓర్వలేనితనాన్ని వైఎస్ఆర్ సీపీ మానుకోవాలని గోమాతను విమర్శంచితే పుట్టగతులు ఉండవని గోమాతను తప్పుగా అనడం విడ్డురంగా ఉందని వ్యక్తం చేస్తున్నామని గోమాతను రక్షించు, గోమాతను పూజించమని ఎస్ఐ వెంకటనారాయణ, తాసిల్దార్ నాగభూషణం కు వినతి పత్రం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు సోమగుట్ట హనుమంత్ రెడ్డి,మురళీమోహన్, రైతుసంఘం నాయకుడు చంద్రమోహన్, గంగాద్రి రవీంద్ర ప్రజలు తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేసారు.