Andhra PradeshPrakasham
గిద్దలూరు పరిసర ప్రాంతాలలో అక్రమ లేఅవుట్ల పై ఉక్కుపాదం : కమిషనర్ రామకృష్ణయ్య
గిద్దలూరు పరిసర ప్రాంతాలలో అక్రమ లేఅవుట్ల పై ఉక్కుపాదం : కమిషనర్ రామకృష్ణయ్య
క్యాపిటల్ వాయిస్, (ప్రకాశం జిల్లా) గిద్దలూరు :-గిద్దలూరు పరిసర ప్రాంతాలలో అక్రమ లేఅవుట్ల పై నగర పంచాయతీ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్ల పై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. లేఅవుట్ల పై దాడులు చేసి ధ్వంసం చేయడంతో పాటు అక్రమ లేఅవుట్ల కు ఉపయోగించే పునాది రాళ్లను నగర పంచాయతీ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణయ్య అన్నారు.