Andhra Pradeshkrishna
దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

దిశ యాప్ అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
క్యాపిటల్ వాయిస్, కృష్ణా జిల్లా ప్రతినిధి :- స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో మహిళా సంరక్షణ కార్యదర్శులు మరియు విద్యార్థులతో ఏర్పాటు చేసిన దిశా యాప్ అవగాహనా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణాజిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌషల్.ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శాయశక్తులా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.రక్షణ లేని సామాజిక ప్రదేశాల పర్యవేక్షణ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.దిశా యాప్ మహిళలకే కాక,పురుషులకు కూడా ఉపయోగపడుతుందన్నారు.ప్రతి ఒక్కరూ దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.నూజివీడు సబ్ డివిజన్ పోలీస్ పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు.అనంతరం హెల్మెట్ వాడకం పై ప్రజల కు అవగాహన కల్పించేందుకు పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.