Andhra PradeshGuntur
దేశం మెచ్చిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు : అంబటి రాంబాబు

దేశం మెచ్చిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు : అంబటి రాంబాబు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) సత్తెనపల్లి :- దేశం మెచ్చిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరని, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని శాసనసభ్యులు అంబటి రాంబాబు అన్నారు.మంగళవారం పట్టణ కార్యాలయంలో జరిగిన డా.ఏ పి జె అబ్దుల్ కలాం 6 వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కలామ్ అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపిన భారతరత్నమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చల్లంచర్ల లక్ష్మి తులసి సాంబశివరావు, వైస్ చైర్మన్ నాగూల్ మీరాన్, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.