బహుజన సమాజ్ పార్టీ అమీన్పూర్ మండల కన్వీనర్…..పఠాన్ చేరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్ చంద్ర శేఖర్ ఎన్నిక

బహుజన సమాజ్ పార్టీ అమీన్పూర్ మండల కన్వీనర్…..పఠాన్ చేరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్ చంద్ర శేఖర్ ఎన్నిక
క్యాపిటల్ వాయిస్, (తెలంగాణ) సంగారెడ్డి :- వివిధ సంస్థలో పనిచేస్తున్న ప్రముఖ వ్యక్తులు మంగళవారం
బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు సతీష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వివిధ కుల సంఘాలలో పనిచేయకుండా బహుజన రాజ్యాధికారం కోసం తమ పార్టీ లో చేరాలని సూచించారు.అలాగే బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే రాజ్యాంగాన్నే ఏజెండాగా కలిగి ఉన్న ఏకైక పార్టీ అని, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరూ బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ కావాలని సూచించారు.
అమీన్పూర్ మండలంలో పార్టీలో చేరిన వారు
ఎన్.చంద్రశేఖర్, ఎం. పృథివిరాజ్, బి.వంశీకృష్ణ, ఎన్. కృష్ణ, కే.ప్రమోద్, కే.ప్రదీప్ లతో పాటు నియోజకవర్గంలోని సుమారు 60 మంది బహుజన సమాజ్ పార్టీ లో చేరి పార్టీ బలోపేతానికి రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు దేశ అభివృద్ధి కోసం తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి జగదీష్,,జిల్లా సెక్రటరీ సంజీవ్ , పటాన్చెరు అసెంబ్లీ అధ్యక్షులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.