Andhra Pradesh

ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి : నారా లోకేష్

ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి : నారా లోకేష్

క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్  చేశారు.గురువారం ఇటీవల నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు కమల్ కి నివాళులర్పించిన అనంతరం జిల్లా టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను పరామర్శించి వస్తుంటే వైకాపా నాయకులకు ఎందుకంత భయం అధికారులు,మంత్రి,వైకాపా నాయకులు కలిసి కమల్ కుటుంబాన్ని మాయం చేసారన్సారు. రాత్రి వరకూ మా కుటుంబానికి కలిగిన కష్టం ఇంకెవరికి కలగకూడదు,ఇంకో కుర్రాడు ఆత్మహత్య చేసుకోకూడదు అని బాధపడిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణ మన్నారు. కమల్ కుటుంబాన్ని మాయం చేసిన వైకాపా నాయకులు చనిపోయిన కమల్ ని తిరిగి తీసుకురాగలరా?అన్నారు. వైకాపా నాయకులు పిరికివాళ్లు అందుకే కమల్ కుటుంబాన్ని మాయం చేసారు. నేను పరామర్శకి వస్తే నిజాలు బయటపడతాయి అని భయపడుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబాలను పరామర్శించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యువతకి ఉన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఇంటర్నేషనల్ యూత్ డే ఒక గొప్ప అవకాశమని కానీ మన రాష్ట్రంలో సమస్యలు చెప్పుకుందాం అంటే వినే నాధుడే లేడన్నారు.  నిరుద్యోగ సమస్యతో రాష్ట్రంలో ఉన్న యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఫ్యాన్ గిర్రున తిప్పి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారన్నారు.ఇప్పుడు అదే ఫ్యాన్ కి నిరుద్యోగులు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.మాట మార్చి,మడమ తిప్పిన జగన్ రెడ్డి  రెండేళ్ల తరువాత 10 వేల ఉద్యోగాలు ముష్టి వేస్తున్నా పండగ చేస్కోండి అంటూ ఫేక్ క్యాలెండర్ వదిలారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?10 వేల ఉద్యోగాలు ఎక్కడ?అందుకే ఆయన్ని నేను జగన్ రెడ్డి అనడం లేదు ఫేక్ రెడ్డి అంటున్నాఫేక్ రెడ్డి  ఇస్తామంటున్న గ్రూప్ 1,2 ఉద్యోగాలు ఎన్నో తెలుసా36 పోస్టులుఅన్నారు. రికార్డులు మొత్తం బద్దలుకొట్టారని .చరిత్ర లో ఇంత చెత్త క్యాలెండర్ ఇచ్చిన సీఎం గా ఫేక్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు.ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు పోవాలి అని కూతలు కూసారని ఇప్పుడు ఫేక్ రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్ట్ ఒక పక్క,జే ట్యాక్స్ దెబ్బ మరోపక్క.ఒక్క కంపెనీ రాక పోగా ఉన్న కంపెనీలు సైతం బైబై ఫేక్ రెడ్డి అంటున్నాయన్నారు.రిలయన్స్,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్,ట్రైటాన్,లులూ,అదానీ,అమర్ రాజా  ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి బై బై చెప్పేసాయన్నారు. ఫేక్  క్యాలెండర్ విడుదల చేస్తూ రెండేళ్ల లో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ ఫేక్ కబుర్లు చెప్పారన్నారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు,పేపర్ లీక్ చేసి అమ్ముకున్న సచివాలయ పోస్టులు,దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు,కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ ఇలా చెప్పుకుంటేపోతే మొత్తం ఫేక్ లెక్కలేనన్నారు.వాలంటీర్లు – 2.6 లక్షల మంది.‘వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చెయ్యడం. ఇది ఉద్యోగం కాదన్నది ఫేక్ రెడ్డి గారే.మరి ఇప్పుడు ఉద్యోగాల లిస్టులో కలపడానికి సిగ్గు వెయ్యలేదా?90 శాతం వాలంటీర్ పోస్టులు కార్యకర్తలకే ఇచ్చాం అని ఏ2 రెడ్డి గొప్పగా ప్రకటించారన్నారు.గ్రామ,వార్డు సచివాలయం – 1.21 లక్షలు.పేపర్ లీక్ చేసి, వైకాపా కార్యకర్తలకు అమ్ముకున్నారన్నారు.

ఆర్టీసి ఉద్యోగులు – 58 వేల మంది వీరంతా దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తున్నారన్నారు.కోవిడ్ నియామకాలు – 26 వేలు.ఇవి తాత్కాలిక ఉద్యోగాలేనన్నారు.ఆప్కోస్ – 95 వేల మంది ఇందులో అత్యధికం మద్యం షాపుల్లో పని చేసే వారెనన్నారు.ఇవన్నీ తీసేస్తే నిజమైన అర్హులకు వచ్చిన ఉద్యోగాలు 15 వేల లోపే.అవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి.ఉద్యోగాలు ఇచ్చింది లేకపోగా టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం 2వేల నిరుద్యోగ భృతి పథకాన్ని రద్దు చేసారన్నారు.2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు స్తోమతకి మించి,అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్నారన్నారు.
రెండేళ్ల ఫేక్ రెడ్డి పాలనలో నిరుద్యోగం పెరిగిపోయింది.ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్పడ్డారన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ  తాజా నివేదిక ప్రకారం చదువుకున్న వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిరుద్యోగ రేటు 38%  ఉందని దక్షిణాది రాష్ట్రాల‌తో పోల్చుకుంటే మన రాష్ట్ర నిరుద్యోగ రేటు ఎక్కువఅన్నారు.దేశంలోనే  నిరుద్యోగ రేటు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ  4వ స్థానంలోఉందన్నారు.చంద్రబాబు గారి ప్రభుత్వం 15.45లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 32లక్షల ఉద్యోగాల కల్పనకు ఎంఓయూలు చేసుకుందన్నారు.టిడిపి హయాంలో 5లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించి, 5.13లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాథి కల్పించారని వైకాపా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు.చంద్రబాబు గారి పాలన లో కియా,హీరో,అపోలో టైర్స్,ఫ్యాక్స్ కాన్,డిక్సన్ లాంటి అనేక కంపెనీలు వచ్చాయన్నారు.ఫేక్ రెడ్డి పాలనలో బీభత్సమైన కంపెనీలు వచ్చాయని .అవేంటో తెలుసా ప్రెసిడెంట్ మెడల్,ఆంధ్రా గోల్డ్,స్పెషల్ స్టేటస్ లాంటి దొంగ లిక్కర్ బ్రాండ్లు వచ్చాయన్నారు.ఈ కంపెనీలు,ఫేక్ రెడ్డి కలిసి పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారన్నారు.మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా,ఉద్యోగాలు ఇస్తా అన్నారని ఇప్పుడు కేసుల మాఫీ కోసం మోదీ  కాళ్ళు పట్టుకుంటున్నారన్నారు.300 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నా ఫేక్  రెడ్డి లో చలనం లేదన్నారు.
క‌ర్నూలు జిల్లా ప్యాపిలి మండ‌లం గోపాల‌న‌గ‌రం గ్రామానికి చెందిన నాగేంద్ర‌ప్ర‌సాద్ బీఈడీ పూర్తిచేసి టీచ‌ర్ ఉద్యోగం సాధించాల‌నే కల కన్నారని .ఉద్యోగం రాకపోవడంతో ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్నాడన్నారు.నాగేంద్రప్రసాద్ అమ్మ జయలక్ష్మమ్మని నేను కలిసానని కూలీ పని చేసుకొని కొడుకుని చదివించారన్నారు.ఆవిడ నన్ను ఒక్కటే అడిగారు నాకు ఎటువంటి సహాయం అవసరం లేదు మరో తల్లికి నాకు కలిగిన కష్టం కలగకుండా నువ్వు పోరాడు అని అన్నారన్నారు..ఆమె ఆ రోజు అన్న మాటలకు నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఇప్పుడు నెల్లూరు లో ఉద్యోగం లేక కమల్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని .కమల్ తండ్రి కనకదుర్గారావు  స్తొమత లేకపోయినా రెక్కల కష్టంతో ఎంబీఏ వరకూ చదివించారన్నారు.ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదని దాంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంఅన్నారు.పరిశ్రమలు మరియు ఐటీ  శాఖ మంత్రి  సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని నెల్లూరు జిల్లా లో ఇద్దరు మంత్రులు ఉన్నారని ఒక ఆయన బాడీ బిల్డింగ్ మంత్రి,ఒకరు నోటి దూల శాఖ మంత్రి.ఒక్క కంపెనీ తెచ్చారా?ఒక్క ఉద్యోగం ఇచ్చారాఅన్నారు.జిల్లా లో ప్రజల్ని గాలికొదిలేసి వైకాపా నాయకులంతా మాఫియా గా తయారై వైన్,మైన్,స్యాండ్ దోచుకుంటున్నారన్నారు.నిరుద్యోగ సమస్యకు ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కానే కాదని .నిరుద్యోగులారా నిరుత్సాహ పడకండి కలిసి పోరాడుదాం. ఫేక్ క్యాలెండర్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని .పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6500 ఎస్ఐ, కానిస్టేబుల్  పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ 1  గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టుల‌తో  జాబ్ క్యాలెండర్ కొత్త‌గా విడుద‌ల చేయాలని 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో  20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలని రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలని ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలని ఈ తుగ్లక్ ప్రభుత్వానికి నెల రోజులు సమయం ఇచ్చినా స్పందన లేదన్నారు..ఈ దున్నపోతు ప్రభుత్వం కొమ్ములు వంచి కొత్త క్యాలెండర్ విడుదల చేసే వరకూ పోరాడతామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!