అరకు వేలి పోలీసుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

అరకు వేలి పోలీసుల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- మావోయిస్టు అమరవీరుల వార్షికోత్సవం పురస్కరించుకొని వాటిని అడ్డుకునేందుకు అరకు వేలి పోలీసులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు వ్యాలీ ఎస్సై షేక్ నజీర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3.4 తేదీల వరకు మావోయిస్టుల అమరవీరుల ఉత్సవాలను అడ్డుకొనే ఉద్దేశంతోనే విశాఖ రూరల్ ఎస్పీ ఏఎస్పిఅరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జిడి బాబు ఆదేశాల మేరకు సివిల్ పోలీసు సిఆర్పిఎఫ్ ఏపీఎస్పీఆధ్వర్యాన పోలీసు స్టేషన్ నుంచి తహసిల్దార్ కార్యలయం వరకు శాంతియూత ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సిఐ లేకపోతే ఎస్ఐ కు సమాచారం అందించాలనీ అందిస్తే గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు. ప్రజలను ప్రబుత్వ ప్రైవేట్ కార్యాలయాలను కాపాడాలని ఆ ఉద్దేశంతోనే శాంతియూత ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ,పోలీస్ సిబ్బంది, సచివాలయం మహిళ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.