అధికారులు కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారా…. లేక కరోనా ఉధృతికి ప్రోత్సాహస్తున్నారా !?️

అధికారులు కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నారా…. లేక కరోనా ఉధృతికి ప్రోత్సాహస్తున్నారా !?️
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం ప్రతినిధి :- కళ్ళకు గంతలు కట్టుకుని అధికారులు పర్మిషన్ ఇచ్చారా అని ప్రశ్నిస్తున్న పలు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు. ఒక్కరికి మాస్క్ లేదు సోషల్ డిస్టెన్స్ లేదు దేనికి సంకేతం కరోనా కేసెస్ రైజ్ అవుతున్న తరుణంలో చిన్న పిల్లలను ఒక చోట చేర్చి మినిమం కరోనా నిభందనలు పాటించకుండా పోటీలు నిర్వహిస్తున్నారని, 3ర్డ్ వేవ్ చిన్నపిల్లలపై భయంకరమైన ప్రభావం చూపిస్తుందని డబ్ల్యూ. హెచ్. ఓ మొదటినుండి హేచరిస్తున్న, నిబంధనలకు విరుద్ధంగా, పోటీలు నిర్వహిస్తున్నారని, దేశ ప్రధాని మాస్క్ ధరించి ఉపన్యాసాలు ఇస్తున్న తరుణంలో, అధికారులకు, పోటీలు నిర్వహించేవారికి సామాన్య భాద్యత కూడా లేకుండా కరోనా ఉదృతికి కారణమవుతున్నారని, ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా పోటీలు నిర్వహించిన వారిపైన, పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన తగు చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు,ఉన్నతధికారులను కోరారు.️