Andhra PradeshGuntur
హోటల్ లో వంట గ్యాస్ లీకై అగ్నిప్రమాదం… హోటల్ పాక దగ్ధం.. పేలిన గ్యాస్ సిలిండర్

హోటల్ లో వంట గ్యాస్ లీకై అగ్నిప్రమాదం… హోటల్ పాక దగ్ధం.. పేలిన గ్యాస్ సిలిండర్
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) చిలకలూరిపేట :- చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామం బొడ్డురాయి వద్ద రామాలయం పక్కన ఉన్న హోటల్ లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ యజమాని కొమిరిశెట్టి వెంకటేష్ ఉదయం గ్యాస్ స్టవ్ పై ఇడ్లీపాత్ర పెట్టి వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు ఎగసి పడ్డాయి. ఆందోళనతో బయటకు పరుగులు తీశాడు. ఒక్కసారిగా మంటలు హోటల్ పాకకు అంటుకొని వ్యాపించాయి. లోపల ఒక ముప్పావు శాతం, రెండు ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్ ఉన్న సిలిండర్ ను బయటకు తెచ్చేందుకు వీలు పడకపోవడంతో కొద్దిసేపటి తర్వాత అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు మంటలను ఆర్పివేశారు.