AnanthapurAndhra Pradesh
హిందూపురం నియోజకవర్గ వైస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య

హిందూపురం నియోజకవర్గ వైస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య
క్యాపిటల్ వాయిస్, హిందూపురం :- క్యాపిటల్ వాయిస్ (శ్రీ సత్య సాయి జిల్లా) హిందూపురం :- శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం లో దారుణమైన హత్య జరిగిన సంఘటన చోటుచేసుకుంది.హిందూపురం నియోజకవర్గం వైస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య కు గరయ్యారు.చౌళూరు లోని తన ఇంటి ముందు కారులో దిగుతుండగా కళ్ళల్లో కారం పొడి చల్లి వేట కొడవళ్ళతో నరికి దారుణంగా మట్టుబెట్టిన గుర్తుతెలియని దుండగులు.తన కుమారుని హత్య కు కారణం ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన సహాయకుడు గోపి, చాకలి రవి, నంజుండ రెడ్డి, మురళి, కేపీ నాగుడు తదితరుల హస్తం ఉన్నట్లు మృతుడు రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు.హత్య వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉందని స్వయంగా మృతుని తల్లి ఆరోపించడం గమనార్హం