గురజాల నియోజకవర్గం ITDP కోఆర్డినేట్ కొప్పుల నాగేశ్వరరావు కిడ్నాప్..!?

గురజాల నియోజకవర్గం ITDP కోఆర్డినేట్ కొప్పుల నాగేశ్వరరావు కిడ్నాప్..!?
క్యాపిటల్ వాయిస్, దాచేపల్లి :-
గురజాల నియోజకవర్గ ITDP కోఆర్డినేటర్ కొప్పుల నాగేశ్వరరావు ని కొద్దిసేపటి క్రితం తను నివాసము ఉంటున్న దాచేపల్లి లోని అపార్ట్మెంట్ గోడ దూకి వచ్చిన గుర్తు తెలియని 4గురు వ్యక్తులు బలవంతంగా తీసుకు వెళ్లినట్లు సమాచారం….❓
గోడ దూకి వచ్చిన వ్యక్తులు అపార్ట్మెంట్ వాచ్ మెన్ ని బెదిరించి కొప్పుల నాగేశ్వరరావు పోటో చూపించి వీడి ఇల్లు చూపిస్తావా లేదా అంటూ హడావిడిగా నాగేశ్వరరావు ఇంటి డోర్ బెల్ కొట్టి తలుపులు తీయగానే బలవంతంగా లాక్కుని వెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఆరోపణ…❗
ఈ లోగా బయటకు వచ్చిన కుటుంబసభ్యులు వచ్చిన గుర్తు తెలియని వ్యకులను ఎవరు మీరు, మా వాడిని ఈ సమయంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగగా సమాధానం చెప్పకుండా లాక్కుని వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళన…❗
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.