గ్రూపులకు కేరాఫ్ అడ్రస్‌గా నగరి నియోజకవర్గం – మంత్రి రోజాకు మొదలైన అయోమయం

గ్రూపులకు కేరాఫ్ అడ్రస్‌గా నగరి నియోజకవర్గం – మంత్రి రోజాకు మొదలైన అయోమయం
క్యాపిటల్ వాయిస్ (చిత్తూరు జిల్లా) నగరి :- ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తోంది. వరుసగా రెండో సారి అధికారం సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా.. నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు జరుపుతున్నారు. స్థానిక కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి.. అ నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్లాలి.. టికెట్టు ఎవరికి ఇవ్వాలి అన్నదానిపై క్లారిటీకి వస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి రోజా కు సమస్య మొదలైంది అంటున్నారు. జగన్ తో జరిగే సమావేశానికి ఎవర్ని దూరం పెట్టాలి, ఎవరితో వెళ్లాలనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారని టాక్. ఎవర్ని తీసుకొని వెళ్తే ఎలాంటి సమస్య వస్తుందో అర్థంకాక తెగ ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ఒకవేళ వెళ్లకపోతే పరిస్థితి ఏంటో అర్థంకాక టెన్షన్ పట్టుకుందట. ఇప్పటికే సీఎం జగన్ తొలి భేటీ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కు చెందిన కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. వాళ్ళతో భేటిలోనే టికెట్ భరత్ కు ఇస్తున్నానని చెప్పడమే కాదు.. గెలిపిస్తే మంత్రి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడు తన నియోజకవర్గం పరిస్థితి ఏంటన్నదే రోజాను భయపెడుతున్న అంశం…ప్రస్తుతం నగరి మంత్రి రోజాకు ఈ టెన్షన్ ఎక్కవైందని టాక్. అసలే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది నగరి నియోజకవర్గం. స్థానికంగా గ్రూపు తగాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సొంత పార్టీ నేతలే ఆమెను ఇబ్బంది పెడుతున్నారి రోజానే పలుమార్లు ఆరోపించారు. నగరిలో వర్గ పోరు గురించి తెలిసినా అధిష్టానం దానిపై ఫోకస్ చేయడం లేదు.. రోజాకు మంత్రి పదవి ఇచ్చి ఆమె కూడా ఏమీ మాట్లాడనీయకుండా చేశారు.. కానీ ఇప్పుడు అధినేత దగ్గరకు ఎవరిని తీసుకెళ్లాలి.. ప్రత్యర్ధి వర్గానికి చెందిన కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు ఉన్నా.. వారు ఏం చెబుతారో అనే టెన్షన్ మొదలైంది.ఈ వర్గ పోరు రోజాకు ఇప్పుడే కొత్త కాదు.. 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన నియోజకవర్గంలో పార్టీలోని గ్రూపు గోల రోజాకు పెద్దగా తలనొప్పిగా మారింది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ అక్కడ జరుగుతూనే ఉంది. రోజా ప్రత్యర్థి వర్గం సమావేశం ఏర్పాటు చేసుకుందట. రోజా మంత్రి అయ్యాక వ్యతిరేక వర్గం దూకుడు తగ్గలేదు. నగరి ప్లీనరీకి అందరూ డుమ్మా కొట్టారు. రోజా సైతం వారిని పిలవలేదు. తాజాగా గ్రానైట్ గొడవ తారాస్థాయికి చేరింది. ఇలాంటి సమయంలో అధినేత నియోజకవర్గాల మీటింగ్‌కు ఎలా వెళ్లాలో అనే ఆలోచన రోజాను తెగ ఇబ్బంది పెడుతోందని సమాచారం. వ్యతిరేక వర్గానికి చెప్పాలా…చెప్పకుండా వెళ్ళాలా అలా వెళితే జగన్ ఏం అంటారోనని టెన్షన్‌లో ఉన్నారట. వ్యతిరేక వర్గం సైతం రోజా మీటింగ్‌కు పిలవకపోతే ఏం చేయాలన్నదానిపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారట.కెకె కుమార్, రెడ్డి వారి చక్రపాణి రెడ్డి,అమ్ములు సహా అందరూ కీలక నేతలే కావడంతో వీరిని వదిలేసి అమరావతి కి వెళితే పరిస్థితి ఏంటనే డైలామాలో ఉన్నారట మంత్రి రోజా. మీటింగ్ కోసం ముందస్తుగా వడమాలిపేటలోని కొద్దిమంది నేతలతో సమావేశమైన రోజాకు షాక్ ఇచ్చారట అక్కడి నేతలు. ఆమె ముందే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. చివరికి మాటమాటా పెరిగి కొట్టుకునే స్ధాయిలో గొడవ జరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో అధినేత దగ్గర జరిగే సమావేశం లోనూ ఇలానే జరిగితే ఇక అంతే సంగతి అని రోజా వర్గంలో హాట్‌హట్‌గా టాక్ నడుస్తోందట.