దుర్గమ్మ సన్నిధిలో నాగుపాము.. పూజయ్యేంత వరకూ పడగవిప్పి మరీ దర్శనం !
క్యాపిటల్ వాయిస్, కృష్ణాజిల్లా :- దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది.దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షమైన నాగుపాము. ఎంతసేపటికీ అక్కడి నుంచి కదల్లేదు. పైగా పూజ అయ్యేంత వరకూ పడగ విప్పి అలానే ఉండింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరులోని కనకదుర్గ ఆలయంలో చోటు చేసుకుంది. కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఓ పాము ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైంది. పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.