National

దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం మాయం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ

దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం మాయం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ

+ గతంలో వార్తాపత్రికలు సమాజంలో అలజడి సృష్టించే కుంభకోణాలను బహిర్గతం చేసేవి

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- దేశంలో పరిశోధనాత్మక జర్నలిజం అనేది మీడియా నుంచి మాయమైపోయి తుందని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మన గార్డెన్‌లో పూసే ప్రతీ పువ్వు ఇప్పుడు అందంగానే కనిపిస్తోంది అంటూ ప్రసార మాధ్యమాల తీరును ఆయన తప్పుబట్టారు. సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల రచించిన పరిశోధనాత్మక బ్లడ్ శాండర్స్ పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వర్చువల్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వార్తాపత్రికలు సమాజంలో అలజడి సృష్టించే కుంభకోణాలను బహిర్గతం చేసేవని, ఈ రోజుల్లో అలాంటి పేలుడు కథనాలు లేవని అన్నారు. ప్రస్తుత మీడియా కొన్ని ఆలోచనల ను పంచుకోవడానికి నేను స్వేచ్ఛ తీసుకుంటున్నాను. పరిశోధనాత్మక జర్నలిజం అనే భావన, దురదృష్టవశాత్తు, మీడియా కాన్వాస్ నుండి కనుమరుగవుతోంది అని జస్టిస్ రమణ అన్నారు. గతంలో పెద్ద పెద్ద కుంభకోణాలను బహిర్గతం చేసే వార్తాపత్రికల కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లని, సమాజంపై దుష్ప్రవర్తన పై వార్తాపత్రిక నివేదికలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి. ఒకటి రెండు మినహా, ఇంత పెద్ద కథనాలు ప్రస్తుత కాలంలో కనిపించడం లేదన్నారు. వ్యక్తులు, సంస్థల సమిష్టి వైఫల్యాలను మీడియా హైలెట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా వ్యవస్థలోని లోపాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!