Andhra PradeshGuntur
దస్తావేజు లేఖరుల చేతిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం

దస్తావేజు లేఖరుల చేతిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం
క్రయ,విక్రయ దారుల వద్ద నుండి అధిక పైకం వసూళ్లు..అధిక సంఖ్యలో అనధికార ఉద్యోగులు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) నరసరావుపేట :- స్థలం కొన్న తరువాత ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెళ్ల్సిందే. మాములుగా అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యలయం వద్దకు వెళ్లి సదరు స్థలం ఎంత అయితే ప్రభుత్వ చలనా ఉందొ ఆ నగదు మొత్తం ప్రభుత్వ ఖాతాకు జమచేసిన తరువాత రిజిస్ట్రేషన్ చేస్తారు.అనంతరం వారు సదరు స్థలం వారికి చెందుతుంది. కానీ నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దళారుల హవా అధికంగా ఉంది.ప్రతి అడుగు కు ఒక దళారి ఉండి నేను మా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని అక్కడికి వచ్చే వారిని మభ్యపెట్టి అధికంగా వారి వద్ద నుండి చలనా వసూళ్లు చేస్తున్నారు.మరి కొంత మంది ఒక అడుగు ముందుకు వేసి మా ద్వారా వెళ్తేనే వేగంగా రిజిస్ట్రేషన్ అవుతుంది అని మరికొందరు దస్తవేజు లేఖరులు అడ్డుపడుతున్నారు.నిత్యం పలు ప్రాంతాల నుండి వచ్చే క్రయ,విక్రయ దారులకు దళారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు.రిజిస్ట్రేషన్ కోసం దస్తవేజులోపలికి వెళ్లినపటి నుండి ఎదో ఒక రూపంలో కొనుగోలు దారులడి నుండి డబ్బు వసూళ్లుకు పాల్పడుతున్నారు.అయితే ఇదంతా తెలియని సామాన్య జనం నిజంగా కట్టాలి అని,లోపల వారికి లంచం ఇవ్వాలని తెలియక బయట వారు అడుగుతున్న చేతిలో పెట్టి తమ పని పూర్తి చేసుకుంటున్నారు.అలాగే ఇదే కార్యాలయంలో అధికంగా ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తూన్నారు. అవసరానికి మించి సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు.ప్రభుత్వ సిబ్బంది కంటే కూడా ప్రైవేట్ సిబ్బంది హడావుడి ఇక్కడ అధికంగా ఉంటుంది.అలాగే అక్రమ రిజిస్ట్రేషన్ కూడ ఇక్కడ అధికంగా జరుగుతున్నాయి అని కొందరు బాహాటంగానే అనుకుంటున్నారు. ఏది ఏమైనా కోట్ల రూపాయల ఆదాయం తీసుకొనివచ్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కొందరు దళారులు,మరి కొందరి ప్రైవేట్ వ్యక్తులు వల్ల ఆదాయం తగ్గి పోతుంది అని సబ్ రిజిస్ట్రార్ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలి అని ప్రజలు కొరుతున్నారు.