Andhra PradeshVisakhapatnam

దర్జాగా నకిలీ పోలీస్ స్టిక్కర్లతో ప్రయాణం….. రంగంలోకి విశాఖ పోలీసులు

దర్జాగా నకిలీ పోలీస్ స్టిక్కర్లతో ప్రయాణం….. రంగంలోకి విశాఖ పోలీసులు

క్యాపిటల్ వాయిస్, విశాఖ జిల్లా ప్రతినిధి :- వృత్తుల‌తో సంబంధం లేకుండా కొంద‌రు స్టిక్కర్లు వేసుకొని ద‌ర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి వార‌పైన దృష్టి పెట్టారు విశాఖ పోలీసులు. పోలీస్ క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో రంగంలోకి దిగారు. నకిలీ స్టిక్క‌ర్‌గాళ్ల‌ను ప‌ట్టుకొంటున్నారు.చాలా మంది త‌మ వాహ‌నాల‌పై పోలీస్ స్టిక్కర్లు, ప్రెస్ (Press) స్టిక్క‌ర్ల‌తో ప్ర‌యాణిస్తుంటారు. వారు నిజంగా అదే వృత్తులు నిర్వ‌ర్తిస్తే ప‌ర్వాలేదు. కానీ ఆ వృత్తుల‌తో సంబంధం లేకుండా కొంద‌రు స్టిక్కర్లు వేసుకొని ద‌ర్జాగా తిరుగుతున్నారు. ఇలాంటి వార‌పైన దృష్టి పెట్టారు విశాఖ పోలీసులు. పోలీస్ క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో రంగంలోకి దిగారు. నకిలీ స్టిక్క‌ర్‌గాళ్ల‌ను ప‌ట్టుకొంటున్నారు.  విశాఖపట్నం హనుమంతవాక మద్దిలపాలెం జంక్షన్‌లో శనివారం(సెప్టెంబ‌ర్ 11) ఉదయం ఏడీసీపీ ఆదినారాయణ పర్యవేక్షణలో ఏసీపీ కుమారస్వామి సీఐ షణ్ముఖ్ నేతృత్వంలో పోలీసులు న‌కిలీ స్టిక్క‌ర్ వాహ‌నాల త‌నిఖీ చేప‌ట్టారు.
పోలీస్ స్టిక్క‌ర్ల‌తో కూడా..
మద్దిలపాలెం లో నిర్వహించిన తనిఖీలలో ఊహకందని నకిలీ స్పీకర్ల తో వాహనదారులు పట్టుబడ్డారు. ఈ త‌నిఖీల్లో ఆశ్చ‌ర్యంగా కొంద‌రి వ‌ద్ద పోలీస్ స్టిక్క‌ర్లు ద‌ర్శ‌నమిచ్చాయి. కొంత‌మంది కార్ల‌పై ప్రెస్ స్టిక్క‌ర్లతో తిరుగుతున్నారు. మరికొంద‌రు జిల్లాలో ఆర్టీఓ బోర్డు పెట్టుకొని షికారు చేస్తున్న ఓ వ్య‌క్తిని పోలీసులు ప్ర‌శ్నించి ఆర్టీఓ  బోర్డును తొల‌గించారు. ఈ త‌నిఖీల్లో నిజ‌మైన జ‌ర్న‌లిస్టులు, పోలీసులు వారి గుర్తింపు చూపించ‌డంతో వారిని వ‌దిలి పెట్టారు.మ‌రి కొంత‌మంది ప్ర‌భుత్వ అధికారుల స్టిక్క‌ర్లు సంబంధం లేకుండా వేసుకొని ద‌ర్జాగా తిరుగుతుండ‌డాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఉహించ‌న‌దాని కంటే ఎక్కువ మంది న‌కిలీ స్టిక్క‌ర్లు వేసుకొని తిరుగుతుండ‌డం పోలీసుల దృష్టికి వ‌చ్చింది. చాలా మంది జిల్లాలో నకిలీ స్పీకర్లతో ప్రయాణించడంతో పోలీసు శాఖ మరి కొంతకాలం పాటు స్పెషల్ డ్రైవర్లు చేయాలని నిర్ణయించుకుంది. ప్రజల్లో చైతన్యం తెచ్చే అంతవరకూ డ్రైవర్ కొనసాగుతాయని పోలీసులు అధికారులు తెలిపారు.త‌నిఖీల‌పై ఏడీసీపీ ఆదినారాయణ మాట్లాడుతూ ఇప్పటికే చాలా మంది నకిలీ స్పీకర్లతో తిరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అలాంటి నకిలీలు తప్పించేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ అన్నారు ఈ డ్రైవ్ లో నిజమైన ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగు గంటల పాటు ఈ డ్రైవ్ నిర్వహించామని ఆయ‌న తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!