Viral News

కరెంట్ లేకుండా నీళ్ళు వస్తున్నాయ్ ……ఎం అయిడియా గురూ !!!

కరెంట్ లేకుండా నీళ్ళు వస్తున్నాయ్ ……ఎం అయిడియా గురూ !!!

క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- సృజనాత్మకత (క్రియేటివిటీ) ఉండాలే కానీ.. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చు  అని ఇప్పటివరకు ఎంతోమంది నిరూపించారు అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పనిలేదు. మనసులో తట్టిన చిన్న ఆలోచనను ఆచరణలో పెడితే అద్భుతాలు సాధించవచ్చు అన్నది  ఇక ఇలా కొంతమంది చేసిన పనులు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇక ఇలాంటిది ఎవరైనా చేశారంటే చాలు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో గాని వార్త గాని వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

సాధారణంగా బావిలో ఉన్న నీటిని పైనకి తీసుకురావాలి అంటే దానికోసం స్పెషల్ గా ఒక బోర్ మోటార్ తీసుకువచ్చి ఇక కరెంట్ సప్లై చేసినప్పుడు మాత్రమే ఇక నీటిని పైనకు తీసుకువచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇక బావిలోకి దిగి నీటిని మోయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బావిలో ఉన్న నీటిని బయటకు తీసుకువచ్చేందుకు వినూత్నమైన ఆలోచన చేశాడు. పెద్దగా కష్టపడకుండానే కరెంట్ లేకుండానే ఇక ఎంతో ఈజీగా నీటిని తోడుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగచక్కర్లు కొడుతుంది.ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక బాలుడు ఒక పొడవాటి కర్ర, టైరు,చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తయారు చేశాడు అని చెప్పాలి. ఇక దాని సహాయంతో కరెంటు అక్కర్లేకుండా

నే ఒక నీటి గుంట నుంచి
నీటిని తోడేస్తూ ఉన్నాడు. తద్వారా ఇక తమ దగ్గర ఉన్న చిన్న వాటర్ ట్యాంకుల్లో నింపేసుకుంటున్నాడు అని చెప్పాలి. కర్రకు ఒకవైపున బరువును మరోవైపున టైరును బిగించాడు. ఇక ఆ టైరుకే నీళ్ల పైపును కూడా తొలగించాడు.
దాని ద్వారానే నీటిని పైకి తీసుకురావడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అతని ఐడియాకు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!